Meezan book
ఉపోద్ఘాతం.2
ధర్మం వాస్తవికత
Essence of Religion
ధర్మం యొక్క సారాంశం
*నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.
(Quran – 51 : 56)
*మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్ కొందరికి సన్మార్గం చూపాడు. మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించినవారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భువిలో తిరిగి చూడండి.
(Quran – 16 : 36)
మా ఆయతులుబోధించబడినప్పుడు సజ్దాలోపడిపోయే వారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడే వారు, గర్వపడనివారుమాత్రమేమాసూక్తులనునమ్ము తారు.
వారి ప్రక్కలు వారిపడకల నుంచివేరుగాఉంటాయి. వారుతమప్రభువును భయంతోనూ,ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు.
(Quran – 32 : 15-16)
*ఓ విశ్వాసులారా! రుకూ, సజ్దాలు చేస్తూ ఉండండి. మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి- తద్వారా మీరు సఫలీకృతులవుతారు.
(Quran – 22 : 77)
Definition of Religion
ధర్మం యొక్క వివరణ
*ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్- సఅసం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకు రావద్దనీ (వారికి) ఉపదేశించాము.(ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు.
(Quran – 42 : 13)
Contents of Religion
ధర్మం లో ఉన్న విషయాలు
(ఓ ముహమ్మద్!) దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పు దారి పట్టించాలనే అనుకుంది. కాని నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోనుచేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్నీ అవతరింప జేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది.
(Quran – 4 : 113)
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి గడువు (ఇద్దత్) ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించ కండి. ఈ వైఖరిని అనుసరించినవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్ను (ప్రవక్త సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి). అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
(Quran – 2 : 231)
The Qur’an also refers to al-Kitab as shari‘ah:
తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన (రాచ)బాటపై నిలబెట్టాము. కనుక (ఓ ముహమ్మద్ – స!) నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు.
(Quran – 45 : 18)
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింప జేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుస రించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు.
(Quran – 5 : 48)
అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు : ”మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అను మతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, ‘ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు’ అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
(Quran – 5 : 110)
al-Hikmah basically comprises the following two topics:
1. Faith
2. Ethics
అల్-హిక్మా ఈ క్రింది రెండు అంశాలను కలిగి ఉంటుంది:
1. విశ్వాసాలు 2. నైతిక విలువలు
al-Kitab comprises the following ten topics:
అల్ కితాబ్ ఈ క్రింది పది విషయాలు కలిగి ఉన్నారు:
1. The Shari‘ah of Worship Rituals
ఆరాధన ఆచారాల శాసనం
2. The Social Shari‘ah
సామాజిక శాసనం
3. The Political Shari‘ah
రాజకీయ శాసనం
4. The Economic Shari‘ah
ఆర్థిక శాసనం
5. The Shari‘ah of Preaching
సందేశ బోధన శాసనం
6. The Shari‘ah of Jihad
జిహాద్ నియమాలు
7. The Penal Shari‘ah
శిక్షించే నియమాలు
8. The Dietary Shari‘ah
ఆహార నియమాలు
9. Islamic Customs and Etiquette
సంప్రదాయ ఆచార నియమాలు
10. Oaths and their Atonement
ప్రమాణాలు మరియు వారి ప్రాయశ్చిత్తం
నియమాలు
ఇవన్నీ ధర్మానికి సంబంధించిన వీ
Prophets and Messengers
ప్రవక్తలు మరియు సందేశహరులు
*మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహిం చాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
(Quran – 2 : 213)
ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారి వద్దకు వచ్చేసినపుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చెయ్యబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
(Quran – 10 : 47)
ఎవరయితే అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల వైరవైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యే వారిలో ఉంటారు.”నేనూ, నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తాము” అని అల్లాహ్ వ్రాసిపెట్టేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలుడు, తిరుగులేనివాడు.
(Quran – 58 : 20-21)
ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చిపంపాడు- దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినాసరే.
(Quran – 61 : 9)
మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము.
(Quran – 73 : 15)
అల్లాహ్ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటు పడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్ఆన్కు పూర్వం కూడా ఆయన (అల్లాహ్) మిమ్మల్ని ‘ముస్లింలు’గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా (మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి (ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్‌ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు!
(Quran – 22 : 78)
Purpose of Divine Books
దైవ గ్రంథాల ఉద్దేశ్యం
మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహిం చాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
(Quran – 2 : 213)
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితోపాటు గ్రంథాన్ని, ధర్మకాఁటాను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది, జనుల కొరకు (ఇతరత్రా) ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా – చూడకుండానే తనకు, తన ప్రవక్త లకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందే హంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు.
(Quran – 57 : 25)
*The Responsibility of Indhār *
హెచ్చరిక ప్రకటన యొక్క బాధ్యత
(ప్రజలారా!) ముహమ్మద్ (సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
(Quran – 33 : 40)
విశ్వాసులందరూ బయలుదేరవలసిన అవసరం లేదు. కాబట్టి వారిప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి ధర్మావగాహనను పెంపొందించుకుని, వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులనుఅలవరచుకునేందుకుగాను వారికి భయబోధ చేయాల్సింది. కాని ఇలా ఎందుకు జరగ లేదు?
(Quran – 9 : 122)
* మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలుదేరటం సరికాదు. కావున వారిలో ప్రతితెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి వారు, వారి వద్దకు తిరిగివచ్చినప్పుడు తమజాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు.(9:122)
వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. (ఓ ప్రవక్తా!) నీవు వాళ్లను బలవంత పెట్టేవాడివి కావు. కాబట్టి నీవు మా హెచ్చరికలకు భయపడేవారికి ఖుర్ఆను ద్వారా బోధపరుస్తూ ఉండు.
(Quran – 50 : 45)
కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్య తిర స్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, (వారికి హితబోధ చేయటానికి) గట్టిగా పాటుపడు(25:52)
సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.(Quran – 25 : 1)
”అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది?” అని వారిని అడుగు. ”నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖుర్ఆను ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్ఆన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్‌తోపాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? ”నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. ”ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
(Quran – 6 : 19)
Islam: The Name of this Religion
ఇస్లాం ఈ ధర్మం యొక్క పేరు
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
(Quran – 3 : 19)
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
(Quran – 3 : 85)
“ఇస్లాం” ఐదు అంశాలను కలిగి ఉంటుంది: 1. అల్లాహ్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరొక దేవుడు లేడని సాక్ష్యమివ్వడం 2. ప్రార్థన 3. జకాహ్ 4. రమదాన్ నెల యొక్క ఉపవాసాలు 5 బేతుల్లాహ్- హజ్ సందర్శన .ఈ అంశాలను ఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో పేర్కొనడం జరిగింది.
Muslim, Al-Jami‘ al-sahih, 24-25, (no. 93).