మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెల కొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.
(Quran – 4 : 103)
*Importance of the Prayer *
(ప్రార్థన ప్రాముఖ్యత) -TheForemostDirective-
(1.అత్యున్నత ఆదేశం)
మా ఆయతులుబోధించబడినప్పుడు సజ్దాలోపడిపోయే వారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడే వారు, గర్వపడనివారుమాత్రమేమాసూక్తులనునమ్ము తారు.వారి ప్రక్కలు వారిపడకల నుంచివేరుగాఉంటాయి. వారుతమప్రభువును భయంతోనూ,ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు.
(Quran – 32 : 15-16)
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్) ధర్మంపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు.(ప్రజలారా!) అల్లాహ్ వైపునకే మరలి, ఆయనకు భయ పడుతూ ఉండండి. నమాజును నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి.(Quran – 30 :30- 31)
వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.(Quran – 2 : 3)
విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
(Quran – 2 : 277)
పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు.అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(Quran – 87 : 14-15)
నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు.వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు. వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజ మాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు.కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు.వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు.వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు.
(Quran – 23 :1- 9)
నిశ్చయంగా మానవుడు మహా దూకుడు స్వభావిగా పుట్టించ బడ్డాడు. (కాస్తంత) కీడు కలగగానే కలవరం చెందుతాడు.మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు.కాని నమాజు చేసేవారు మాత్రం అలాంటివారు కారు.వారు తమ నమాజుల (వ్యవస్థ)పై నిత్యం కొనసాగు తారు.వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది.అడిగేవారికి, అడగని వారికి కూడా.వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారై ఉంటారు.వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు.నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు.వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు.అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు.
ఇక ఎవరయినా ఇదిగాక ఇంకా ఏవైనా (ఇతరత్రా అడ్డ దారులు అవలంబించ) కోరితే, వారు హద్దు మీరిన వారవుతారు.వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు.వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు.ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు.ఇలాంటి వారే స్వర్గవనాలలో సగౌరవంగా ఉండేవారు.
(Quran – 70 : 19-35)
A Requisite for Muslim Citizenship
ముస్లిం పౌరసత్వానికి అవసరమైనది
ఇప్పటికయినా వారు పశ్చాత్తాపం చెంది, నమాజ్నునెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసినవారి కోసం మేము మా ఆయతు లను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము.
(Quran – 9 : 11)
వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు.
పైగా వాడు (సత్యాన్ని) ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు.మిడిసిపడుతూ, తన ఇంటివారల వైపు వెళ్ళిపోయాడు.
శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం.మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం.
(Quran – 75 : 31-35)
*Means of Strong Adherence to Islam *
ఇస్లాం ధర్మం యొక్క బలమైన అనువర్తనము
నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి.పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు.(Quran – 2 : 238-239)
ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు.
(Quran – 19 : 59)
(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
(Quran – 29 : 45)
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు.
(Quran – 43 : 36)
As Eraser of Sins
తప్పులను చెరిపివేసింది
దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు – రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్య కార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం.
(Quran – 11 : 114)
Means of Countering Hardships
కష్టాలను ఎదుర్కొనే సాధనము
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
(Quran – 2 : 153)
*కనుక (ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్రసమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు.
రాత్రిపూట కూడా (ఏసమయంలోనయినా) ఆయన పవిత్ర తను కొనియాడు, మరి నమాజు తరువాత కూడా (ఆయన్ను స్తుతించు).
(Quran – 50 : 39- 40)
*మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థిం చండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైన పని).
(Quran – 2 : 45)
Symbol of True Da‘wah
సత్యసందేశం యొక్క చిహ్నం
*ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ, నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్య ఫలాన్ని మేము వృథా చేయము.
(Quran – 7 : 170)
Means of Perseverance on the Truth
సత్యంపై నిలకడకు సాధనం
*ఓ వస్త్రమును కప్పుకున్నవాడా?
కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు.సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో.లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖుర్ఆన్ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.నిశ్చయంగా మేము నీపై ఒక బరువైన వాక్కును వేయ నున్నాము.
నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది.నిశ్చయంగా పగటిపూట నీకు సుదీర్ఘ మైన వ్యాపకాలున్నాయి.అందుకే నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నింటినీ వదలి ఆయన వైపే మనసును లగ్నం చేయి.
(Quran – 73 :1 – 8)
*తస్మాత్ జాగ్రత్త! నువ్వు వాడి మాట వినకు. (నీ ప్రభువు సన్నిధిలో) సాష్టాంగ పడి, సామీప్యం పొందు.
(Quran – 96 : 19)
As the Nature of every Object of the Universe
విశ్వంలోని ప్రకృతి సహజ స్వభావం
సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్ర తనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు.
(Quran – 17 : 44)
భూమ్యాకాశాలలో వున్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులూ అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు (జనులు) చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
(Quran – 24 : 41)
ఏమిటీ, వారు అల్లాహ్ సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా (నిశిత దృష్టితో) చూడలేదా? వాటినీడలు కుడివైపు, ఎడమ వైపు వాలుతూ, అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడుతుంటాయి. తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. (దీన్ని వారు గమనిం చటం లేదా?).
నిశ్చయంగా ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు, దూతలు – అందరూ అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడు తున్నారు – ఏమాత్రం అహంకారం చూపటం లేదు.(Quran – 16 : 48 -49)
ఆకాశాలలో ఉన్నవారూ, భూలోకవాసులు, సూర్య చంద్రులూ, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలా మంది మనుషులు కూడా అల్లాహ్ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించటం లేదా? (దైవ) శిక్షకు అర్హులైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అల్లాహ్ పరాభవం పాల్జేసిన వానిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు.
(Quran – 22 : 18)
As Real Life
వాస్తవ జీవితం
ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికీ- అతని మనసుకూ మధ్య అడ్డుగా వస్తాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి.
(Quran – 8 : 24)
ఇంకా ఈ విధంగా ప్రకటించు : ”నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.(Quran – 6 : 162)
History of the Prayer
ప్రార్థన యొక్క చరిత్ర
”మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదలిపెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు – వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు.
(Quran – 14 : 37)
”నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.”
(Quran – 14 : 40)
అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు.
(Quran – 19 : 55)
వారిలా అన్నారు : ”ఓ షుఐబ్! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలిపెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చుపెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా, రుజు వర్తనునిలా ఉన్నావే?!”
(Quran – 11 : 87)
ఇంకా – మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు (నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్ (దానాన్ని) చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి సూచించాము (వారి వైపుకు వహీ పంపాము). వారంతా మమ్మల్నే ఆరాధించేవారు.(Quran – 21 : 73)
“నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయ టానికి నమాజును నెలకొల్పు.
(Quran – 20 : 14)
కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ”అల్లాహ్ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకు డౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.(Quran – 3 : 39)
“నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు.”
(Quran – 19 : 31)
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కా ర్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.(Quran – 31 : 17)
ఆ నమాజీలకు వినాశం తప్పదు (‘వైల్’ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది).(ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.
(Quran – 107 : 4-5)
Objective of the Prayer
ప్రార్థన యొక్క లక్ష్యం
*ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.
ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.
(Quran – 33 : 41-42)
“నేనే నీ ప్రభువును. నువ్వు నీ చెప్పులు విడువు. ఎందుకంటే (ఇప్పుడు) నువ్వు పవిత్రమైన ‘తువా’ లోయలో ఉన్నావు.”నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు వహీ ద్వారా అంద జేయబడేదంతా శ్రద్ధగా విను –
“నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయ టానికి నమాజును నెలకొల్పు.
(Quran – 20 : 12-14)
Pre-Requisites of the Prayer
ప్రార్థనకు ముందు ఆవశ్యకతలు
విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశు ద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించే వాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
(Quran – 4 : 43)
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధా వస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో – నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్’ చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞు లయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!
(Quran – 5 : 6)
(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు.
(Quran – 2 : 144)
Rituals of the Prayer
ప్రార్థన యొక్క ఆచారాలు
(1) Raf‘ al-Yadayn
(2) Qiyam
(3) Ruku‘
(4) Qawmah
(5) Prostration
(6) Jalsah
(7) Qa‘dah
@1].Al-Bukhari, Al-Jami‘ al-sahih, 104, (no. 631).
[2].Al-Bukhari, Al-Jami‘ al-sahih, 120, (nos. 735, 737); Muslim, Al-Jami‘ al-sahih, 165, (nos. 862, 864, 865).
[3].Abu Da’ud, Sunan, vol. 1, 197, (no.753);AbuBakr Muhammad ibn Ishaq ibn Khuzaymah al-Nisaburi, Sahih, 2nd ed., vol. 1 (Beirut: Al-Maktab al-islami, 1992), 233-234, (no. 459); Al-Bayhaqi, Al-Sunan al-kubra, vol. 2, 42, (no. 2317). Al-Nasa’i, Sunan, 122, (no. 884).
[4]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 120, (nos. 736, 738); Muslim, Al-Jami‘ al-sahih, 165, (no. 865); Abu Da’ud, Sunan, vol. 1, 190, (no. 726); Al-Nasa’i,Sunan, 122, (no. 881).
[5]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 120, (no. 737); Muslim, Al-Jami‘ al-sahih, 165, (no.861).
[6]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 120, (no. 739).
[7].Al-Nasa’i,Sunan, 150, (no.1086).
[8]. Abu Da’ud, Sunan, vol. 1, 191, (no.730); Ibn Majah, Sunan, 466-467, (no.862).
[9]. Muslim, Al-Jami‘ al-sahih, 170, (no.896); Abu Da’ud, Sunan, vol. 1, 198, (no.759).
[10]. Muslim, Al-Jami‘ al-sahih, 170, (no.896); Al-Nasa’i,Sunan, 123, (no.890).
[11]. Muslim, Al-Jami‘ al-sahih, 170, (no.896)..
[12]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 134, (no. 828); Abu Da’ud, Sunan, vol. 1, 192-193, (no.734).
[13]. Ahmad ibn Hanbal, Musnad, vol. 3, 336, (no. 10420).
[14]. Abu Da’ud, Sunan, vol. 1, 192-193, (no.734).
[15]. Ibid.
[16]. Muslim, Al-Jami‘ al-sahih, 204-205, (no. 1110); Abu Da’ud, Sunan, vol. 1, 191, (no. 730).
[17]. Abu Da’ud, Sunan, vol. 1, 224, (no.855),Al-Nasa’i,Sunan, 142, (no. 1028); Ibn Majah, Sunan, 470-471, (nos.870, 871).
[18]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 134, (no. 828).
[19]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 129, (no. 800); Muslim, Al-Jami‘ al-sahih, 197, (no. 1060).
[20]. Ahmad ibn Hanbal, Musnad, vol. 3, 336, (no. 10420).
[21]. Abu Bakr ‘Abdullah ibn Muhammad ibn Abi Shaybah, Al-Musannaf fi al-ahadith wa al-athar, 2nd ed., vol. 1 (Beirut: Dar al-kutub al-‘ilmiyyah, 2005), 237, (no. 2716).
[22]. Ibid., vol. 1, 236-237, (nos. 2712, 2716).
[23]. Abu Da’ud, Sunan, vol. 1, 192-193, (no.734); Al-Nasa’i,Sunan, 123, (no.890).
[24]. Muslim, Al-Jami‘ al-sahih, 204, (no. 1107).
[25]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 131, (no. 807); Muslim, Al-Jami‘ al-sahih, 204, (no. 1106, 1108).
[26]. Muslim, Al-Jami‘ al-sahih, 201-202, (no. 1090).
[27]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 134, (no. 828).
[28]. Ibn Khuzaymah, Sahih, vol. 1, 328, (no. 654); Abu Hatim Muhammad ibn Hibbanal-Busti,Al-Ihsan fi taqrib SahihIbn Hibban, 1sted. (Beirut: Dar al-ma‘rifah, 2004), 596, (no. 1933).
[29]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 132, (no. 812); Muslim, Al-Jami‘ al-sahih, 203, (no. 1099).
[30]. Abu Da’ud, Sunan, vol. 1, 191-193, (nos.730, 734).
[31]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 128, (no. 792); Muslim, Al-Jami‘ al-sahih, 196, (no. 1057).
[32]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 133, (no. 821); Muslim, Al-Jami‘ al-sahih, 197, (no. 1060).
[33]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 133, (no. 823); Abu Da’ud, Sunan, vol. 1, 191, (no.730).
[34]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 134, (no. 828); Abu Da’ud, Sunan, vol. 1, 191-193, (nos.731, 734).
[35]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 134, (no. 828); Abu Da’ud, Sunan, vol. 1, 191-193, (nos. 730, 734.)
[36]. Muslim, Al-Jami‘ al-sahih, 235, (no. 1307); Abu Da’ud, Sunan, vol. 1, 192-193, (no. 734). What was the reason for this gesture? Since the Prophet (sws) has not offered any explanation for this, hence, in all probability, it was some specific ritual for him which he did not intend to initiate as a Sunnah.
[37]. Muslim, Al-Jami‘ al-sahih, 235-236, (nos.1309, 1310, 1311).
[38]. Al-Bukhari, Al-Jami‘ al-sahih, 128, (no. 793); Abu Da’ud, Sunan, vol. 1, 191-192, (nos.730, 731).
[39]. Muslim, Al-Jami‘ al-sahih, 236, (no. 1315).